హైదరాబాదు నుంచి తిరుమలకు వచ్చే భక్తుల కోసం వైసీపీ ఎంపీ గురుమూర్తి కేంద్రానికి వినతి
హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన ప్రయాణ ఛార్జీలు అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఒక లేఖ రాశారు. ఈ మార్గంలో ప్రయాణించే వారిలో ఎక్కువమంది తిరుమల శ్రీవారి భక్తులు, సీనియర్ సిటిజన్లు, మధ్యతరగతి కుటుంబాలేనని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఇతర దేశీయ మార్గాలతో పోలిస్తే హైదరాబాద్-తిరుపతి మధ్య విమాన ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులపై ఆర్థిక భారం పడుతోందని ఎంపీ గురుమూర్తి వివరించారు. అధిక ఛార్జీలు ఉన్నప్పటికీ ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా ఉందని తెలిపారు. ఛార్జీలను తగ్గించడంతో పాటు, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా విమాన సర్వీసుల సంఖ్యను కూడా పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో ఈ మార్గంలో 13,367 విమాన సర్వీసుల ద్వారా సుమారు 11,84,355 మంది ప్రయాణించినట్లు ఎంపీ తన లేఖలో గణాంకాలను ఉదహరించారు. ఈ లేఖ ద్వారా ఎంపీ గురుమూర్తి కీలకమైన ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.